బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ చర్చలు

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ చర్చలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.ఈ చర్చల్లో ఈలన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇంకా వెలువడలేదు.మార్చి 24న జరిగిన ఈ సంభాషణలో మధ్యప్రాచ్య పరిస్థితులు, ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రతపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం భద్రతపై ఇరుదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతిని నెలకొల్పడానికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు.

రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య జరిగే చర్చల్లో ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అసాధారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మస్క్ పాల్గొన్నారనే వార్తలతో అమెరికా రాజకీయాల్లోనూ చర్చలు జోరందుకున్నాయి.ఇదిలా ఉంటే, ఈ ఫోన్‌కాల్ మోదీ–ట్రంప్ సంబంధాల బలోపేతానికి సంకేతమా..? మస్క్ పాత్ర ఏంటి..? అనే ప్రశ్నలు ఇంకా అనుతరంగానే ఉన్నాయి. అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ఈ అంశంపై స్పష్టత రానుంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ