బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఐపీఎల్ వేళ బెట్టింగ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

ఐపీఎల్ వేళ బెట్టింగ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు ఐపీఎస్ అధికారి వి. సి. సజ్జనార్. బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇందులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని దుర్వినియోగం చేసుకుంటూ కొన్ని ముఠాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువతను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని మోసగాళ్లు వల వేస్తున్నారని హెచ్చరించారు.మొదట చిన్న మొత్తాలతో నమ్మకం కల్పించి, తరువాత భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించి మోసం చేయడం ఈ యాప్‌ల అసలు విధానమని వివరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని యువతకు సూచించారు.అనధికారిక బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా, గదులు అద్దెకు తీసుకుని రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్లను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి