బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… DEET యాప్‌తో ఉద్యోగ సమాచారం మీ చేతిలోనే

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… DEET యాప్‌తో ఉద్యోగ సమాచారం మీ చేతిలోనే

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన DEE Telangana (DEET) యాప్‌పై అవగాహన పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి నుంచి పీజీ వరకు చదువులు పూర్తి చేసే వారి సంఖ్య పెరుగుతున్నా, సరైన సమాచారం లేక చాలామంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. యాప్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారి విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా జాబ్ నోటిఫికేషన్లు అందుతాయి.యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, నైపుణ్యాలు నమోదు చేసి, సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్లు ఆన్ చేసుకుంటే కొత్త ఉద్యోగ సమాచారం వెంటనే అందుతుంది.ముఖ్యంగా, ఈ యాప్ కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేస్తూ, అభ్యర్థుల ప్రొఫైల్‌కు సరిపోయే ఉద్యోగాలను సూచిస్తుంది.ఇక ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు కావచ్చు. దీంతో ఉద్యోగార్థులు, ఉద్యోగదాతలు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంటుంది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే లక్షకు పైగా అభ్యర్థులు చదువులు పూర్తి చేసిన నేపథ్యంలో, ఇలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి