బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం… కవిత సంచలన ప్రకటన

తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం… కవిత సంచలన ప్రకటన

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్త పార్టీ స్థాపనను ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆమె, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ తీసుకురావాలని సంకల్పం వ్యక్తం చేశారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు అజెండాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ఆశయాలను ప్రతిబింబించే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండనున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా “నీళ్లు, నిధులు, నియామకాలు” లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని కవిత అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సర్వోదయ తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా కొత్త పార్టీ ముందుకు వస్తుందని వివరించారు.నిజామాబాద్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ మట్టిలో ఉన్న శక్తి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని చెప్పారు.ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ కొనసాగుతున్న సమయంలో, ఈ కొత్త పార్టీ ప్రవేశం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రకటించనున్న పూర్తి అజెండాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి