బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

కరీంనగర్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: గండ్రపల్లి గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత మూడు నెలల్లో 28 మంది మృతి చెందడంతో గ్రామం మొత్తం భయాందోళనలకు గురైంది. వృద్ధులతో పాటు యువకులు కూడా చనిపోవడం స్థానికుల్లో మరింత ఆందోళన పెంచింది.ఈ పరిణామాలతో గ్రామానికి ఏదో అరిష్టం సోకిందనే నమ్మకం బలపడింది. గ్రామ పెద్దలు, పురోహితులను సంప్రదించగా, కీడు నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు.దీంతో గ్రామస్తులు ఒకేసారి ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబాలతో కలిసి గ్రామం బయటకు వెళ్లి సంప్రదాయ పూజలు నిర్వహించారు. కొంతసేపు గండ్రపల్లి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది.ఇక మరోవైపు, ఈ మరణాల వెనుక అసలు కారణాలు ఏమిటన్నది ప్రశ్నగా మారింది. కలుషిత నీరు, అంటువ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిపుణులు వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, గ్రామస్తుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని సూచిస్తున్నారు. మూఢనమ్మకాల కంటే శాస్త్రీయ దృష్టితో సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి