అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కువ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినా, వైకాపా మాత్రం విభిన్నంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. అమరావతిని బలహీనపర్చే ప్రయత్నాలు జరిగాయని, వాటిని చట్టబద్ధతతో అడ్డుకున్నామని చంద్రబాబు అన్నారు. ఈ బిల్లు ఆమోదం రాజధాని అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
“అమరావతిని నాశనం చేయాలనుకున్నారు.. మేము శాసనం చేశాం” – చంద్రబాబు
