బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు స్పీడ్.. అదనపు భూసేకరణకు సర్కార్ చర్యలు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు స్పీడ్.. అదనపు భూసేకరణకు సర్కార్ చర్యలు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన భూమి సరిపోకపోవడంతో అదనపు భూసేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది.ఇప్పటికే ఎయిర్‌స్ట్రిప్‌కు అనుబంధంగా ఉన్న భూమిని గుర్తించిన అధికారులు, పూర్తి స్థాయి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరింత విస్తీర్ణం అవసరమని నిర్ణయించారు. దీంతో మరో సుమారు 430 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఖానాపూర్, నిషాన్ ఘాట్, అనుకుంట ప్రాంతాల్లో భూసేకరణపై దృష్టి సారించారు.ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఉన్న భూమి పరిమితంగా ఉండటంతో, విస్తరణ తప్పనిసరైంది. ఉడాన్ 2.0 పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత లభించడంతో పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ సిద్ధంగా ఉండగా, భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కలగడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి