Breaking News

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ

సూర్యాపేట కోదాడ ఏప్రిల్ 4,నేటి తెలుగు పత్రిక: నాడు తెలంగాణలో సాగుతున్న నైజాం రజాకార్ల రాచరిక పాలన సాగుతున్న రోజుల్లో కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ పాత తాలూకాలో రంగాపురం గ్రామంలో ధనిక రైతు కుటుంబంలో 1930 లో జన్మించింది.చిన్న వయసులో తండ్రిని కోల్పోయిన ఆమె వారి అమ్మమ్మ రాఘవమ్మ తల్లి ఎర్రమ్మ పెంపకంలో పెరిగింది.అమ్మమ్మ రాఘవమ్మ అనసూయను అపురూపంగా పెంచింది.పక్క గ్రామమైన వెలిదండ గ్రామంలో చిన్నతనంలోనే అన్యాయాలను అక్రమాలను దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించటంతో పాటు గ్రామంలో చైతన్యవంతమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకులందరిని సమీకరిస్తున్న రోజుల్లో కామ్రేడ్ మేదరమట్ల సీతారామయ్యకి 1944 అనసూయతో వివాహము జరిగింది.నాటినుండి ఆమె తుదిశ్వాస వరకు విప్లవోద్యమంతో పెనవేసుకున్న ఆమె జీవితం ఎన్నో కష్టాలు నష్టాలు కన్నీళ్లు వచ్చిన మేదరమట్ల సీతారామయ్యకు వెన్నంటే ఉండి చంద్రునికో నూలుపొగుల అనసూయ విప్లవ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించింది.అందుకే ఆమె ధన్యజీవి ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శం.కామ్రేడ్ సీతారామయ్యతో వివాహం జరిగేనాటికి అనసూయకి రాజకీయాలు తెలియవు. కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ పోరాటాలు సాగిన నిర్బంధం ఆమెపై ప్రత్యక్ష ప్రభావం చూపింది.కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ ఆ కాలంలో వచ్చిన నిర్బంధాలను తట్టుకొని తన ఊరు ఇల్లు వదిలి పోలీస్ నిర్బంధాన్ని తప్పించుకొని వారి అమ్మమ్మ రాఘవమ్మతో కలిసి గుంటూరు చేరుకొని పొగాకు కంపెనీలో కూలీ పనిగా చేరి రూపాయి,బేడ పైసలకు పని చేశారు.

అనసూయ ధనిక రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ విప్లవ పోరాటంలో ఆమెకున్న అనుబంధం వల్ల ఆమె ఏనాడూ భయపడలేదు.నిరాశకు గురి కాలేదు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ పోరాటంలో సాగిన నిర్బంధం ఆమెను ఉత్తమ కమ్యూనిస్టుగా తీర్చిదిద్దింది.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళ నాయకుడిగా పనిచేస్తున్న కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్య ఫై తీవ్రమైన నిర్బంధం కొనసాగుతున్న కాలంలో సీతారామయ్య రహస్య జీవితం గడపవలసి వచ్చింది.ఆ కాలంలో కామ్రేడ్ అనసూయ రంగాపురం తన తల్లిగారి ఇంట్లో ఉండేది.తన తల్లి ఇంటి పైన తీవ్రమైన నిర్బంధం వచ్చింది.అనేకసార్లు పోలీసు మిలిటరీ ఆ ఇంటిని దోపిడీ చేశారు.అనసూయతో పాటు అమ్మమ్మ రాఘవమ్మ తల్లి ఎర్రమ్మలను విపరీతంగా కొట్టి అనేక చిత్రహింసలకు గురి చేశారు.తల వెంట్రుకలు తీసి గుండు కొట్టించారు అయినా అనసూయలో ధైర్యం సడలలేదు.అనేక ఇబ్బందులను అవమానాలను భరించాల్సి వచ్చింది.అనసూయ కమ్యూనిస్టు రాజకీయాలతో మమేకం కావడంతో సామాజిక స్పృహ కలిగిన ఆమె.కుల కట్టుబాట్లు అసమానతలు వ్యాప్తిలో ఉన్న ఆ రోజుల్లో కులం పట్టింపులు అంటరానితనం,అసమానతలు లాంటి దురాభిప్రాయాలను దూరం పెట్టి అన్ని బంధుత్వాల కన్నా రాజకీయ ఐక్యతే బలమైనదిగా ఆమె నమ్మారు.

ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష

నిర్బంధాలు ఆర్థిక ఇబ్బందులను ఏనాడు లెక్కచేయలేదు.అన్నిటికి మించి కమ్యూనిస్టు రాజకీయాలు విప్లవ పోరాటలు పరిచయం కావడంతో కారు చీకటిలో కాంతిరేఖల కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్యకు ఎల్లవేళలా అండగా ఉంటూ తుదిశ్వాస విడిచే వరకు ధైర్యసహసాలతో ముందుకు సాగటమే అనసూయలో ఉన్న గొప్ప లక్షణం.సాయుధ పోరాట విరమణ అనంతరం ఉద్యమాల్లో కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్య అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.పార్టీ నాయకత్వాన సాగిన లింగగిరి హుజూర్నగర్ అగ్రహారం గ్రామాల్లో జరిగిన భూపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు భూములు పంచబడ్డాయి.హుజూర్నగర్ ప్రాంతంలో ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ పైన తీవ్రమైన నిర్బంధం సాగింది.హుజూర్నగర్ డివిజన్లో మండే కొలిమిలా పొనుగోడులో అందే నరసయ్య.సుందరి బసవయ్య హత్య యాతవాకిళ్ల గ్రామంలో కోలాహలం పున్నం రాజు హత్య మల్లారెడ్డి గూడెంలో కందుల గురువారెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,హత్య వెలిదండలో ఈసారపు వీరయ్య హత్య అనేక గ్రామాల్లో అరాచక శక్తులు విజృంభిస్తున్న రోజుల్లో శత్రు శిబిరాన్ని గడగడలాడించిన సీతారామయ్య.ఆయన పేరు వింటేనే శత్రువులకు లాగు తడిచేది.( ఎమ్మెస్) ఇల్లు నాటికి నేటికి విప్లవ కేంద్రమే పార్టీపై నిర్బంధం వచ్చినప్పుడల్లా పార్టీ క్యాడర్ రోజుల తరబడి ఆ ఇంట్లో తలదాచుకునేవారు కామ్రేడ్ అనసూయ అందరితో మమేకమై కష్టాల్లో ఉన్న క్యాడర్ కు ( కార్యకర్తలకు నాయకులకు) ధైర్యాన్ని నూరిపోసేవారు వారికి భోజనం పెట్టేవారు.ఎంతో త్యాగనిరతి కలిగిన అనసూయ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆమె చూపిన తెగువ,ధైర్యం నిరంతరం ప్రజల మదిలో స్ఫురిస్తూనే ఉంటాయి.ఆమె ధన్యజీవి.సంపూర్ణమైన విప్లవ జీవితం గడిపారు.ఆమెకు నలుగురు కూతుళ్లు.వారు ఎంతో ప్రయోజకులైనారు.ఆడపిల్లలని ఆమె ఏనాడు కలత చెందలేదు.చివరకు స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కూడా నిరాకరించింది..ఆమె నీతి నిజాయితీ నిబద్ధతకు ధైర్య సాహసాలు చివరికంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గా జీవించటమే అనసూయలో ఉన్న గొప్ప లక్షణంఆమె కొంతకాలంగా అనారోగ్యానికి గురై 25 మార్చి 2026 న తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం మనందరం ముందుకు సాగుదాం.విప్లవ జేజేలు అర్పిద్దాం.ఇదే అనసూయకు మనం ఇచ్చే ఘనమైన నివాళి.

క్యూనెట్ స్కామ్‌లో షాకింగ్ ట్విస్ట్.. స్టార్ హోటళ్లలో మోసాల వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *