బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బిఆర్ నాయుడును టిటిడి చైర్మన్ గా తక్షణమే తొలగించాలి: రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

బిఆర్ నాయుడును టిటిడి చైర్మన్ గా తక్షణమే తొలగించాలి: రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

పామర్రు, ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బి ఆర్ నాయుడును,టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి,పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, మరియు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రస్తుత టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ను పదవి నుంచి వెంటనే తో ల గించాలని కోరుతూ నియోజకవర్గ వైసిపి ఆధ్వర్యంలో పామర్రు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం తో పాటు, శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప సన్నిధిలో శనివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయ్యప్ప స్వామి సన్నిధానం బయట ప్రాంతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ,బి ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిఅతని పై ఏదో ఒక వివాదాస్పదమైన వార్త వస్తూనే ఉందన్నారు.తిరుమల కొండపైన ఎన్నో అపచారాలు, అక్రమాలు జరుగుతుంటే,బిఆర్ నాయుడు అవేమి పట్టనట్టు వ్యవహరిస్తూహిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.ఇన్ని జరుగుతున్న బి ఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడాన్ని చంద్రబాబు నాయుడు ఒకసారి పునరాలోచించుకోవాలన్నారు.బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తూ140 కోట్ల మంది హిందువుల మనోభావాలనుకూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు. టిటిడి దేవస్థానం చైర్మన్గా విఆర్ నాయుడు ప్రవర్తన ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్రతను మంటగలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే బిఆర్ నాయుడు చేసిన తప్పులపై ఎన్నో ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంపై ప్రజలు ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ పరిధిలో ని జడ్పీటీసీ సభ్యులు,ఎంపీపీ లు,ఎంపీటీసీ సభ్యులు,అపార్టీ నేతలు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్