బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షల బీమా

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షల బీమా

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికుల కోసం మరో సంక్షేమ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇకపై కార్మికులు సహజ మరణం పొందిన సందర్భంలో వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.ఇప్పటివరకు విధుల్లో ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు మాత్రమే బీమా వర్తించగా, కొత్త నిర్ణయంతో సహజ మరణాలకు కూడా ఈ ప్రయోజనం విస్తరించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.ఈ బీమా అమలుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదిరింది. యూనియన్ బ్యాంకులో జీత ఖాతా ఉన్న కార్మికులకు ఈ సదుపాయం అందుతుంది. ఇతర బ్యాంకులు కూడా త్వరలో ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.ఇప్పటికే ప్రమాద మరణాలపై రూ.1 కోటి వరకు బీమా సదుపాయం అందుతున్న నేపథ్యంలో, కొత్తగా సహజ మరణాలకూ ఆర్థిక భరోసా కల్పించడం కార్మిక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోంది.ఈ పథకానికి కార్మికులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, మొత్తం వ్యయాన్ని బ్యాంకే భరిస్తుంది. దీంతో కార్మికుల సంక్షేమానికి మరింత బలమైన రక్షణ వలయం ఏర్పడింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి