కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్
కరీంనగర్, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులలో ప్రైవేట్ పీ ఈ టీ లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సిక్స్ లీగ్ క్రికెట్ ట్రోపీ ఆదివారంతో ముగిసింది. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోపీలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వ్యాయామ విద్య ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని విద్యార్థులను క్రమశిక్షణగా తీర్చిదిద్దే బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ సంవత్సరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పీ ఈ టీ లు క్రీడారంగంలో జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే ముందంజలో నిలుపాలని సూచించారు. జిల్లా ప్రైవేటు పిఈటి సంఘానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో బిజీ బిజీగా ఉండే పీఈటీలు ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పోటీలు నిర్వహించిన తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం మేయర్ శ్రీనివాస్, జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ ను ప్రైవేటు పిఈటి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేటా టిఎస్ అధ్యక్షులు బాబు శ్రీనివాస్ గౌడ్, శ్లోక స్పోర్ట్స్ నిర్వాహకులు బూర్ల అనిల్, అమృత్, ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీధర్ గౌడ్, దారం గౌతంరెడ్డి, కోశాధికారి కంకటి అనూప్ కుమార్, సిలివేరి మహేందర్, భార విద్యాసాగర్, మహేష్, ఆనంద్, శ్రీధర్, మనీ, వినయ్, ఉదయ్ , రామకృష్ణ, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కనకం సమ్మయ్య, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కటకం లోకేష్ తోపాటు సుమారు 150 మంది ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న పిఈటిలు పాల్గొన్నారు.
