Breaking News

గాజులరామారంలో మెగా బస్ టెర్మినల్.. హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు ప్రాంతమైన గాజులరామారంలో భారీ స్థాయిలో మెగా బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ టెర్మినల్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లపై పడుతున్న భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ టెర్మినల్‌ను ఆధునిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. అంతరాష్ట్ర బస్సులకు ప్రత్యేక టెర్మినల్, నగర బస్సులకు వేరు సౌకర్యం, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపో, చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.అంతరాష్ట్ర బస్సులు నగరంలోకి రాకుండా శివార్ల నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ప్లాన్ చేయడంతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. అదనంగా ప్రయాణికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టులు, వెయిటింగ్ హాల్స్ వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *