బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

సెకన్లలోనే కరెంట్ బిల్లు.. స్మార్ట్ టెక్నాలజీతో విద్యుత్ శాఖ కొత్త విధానం

సెకన్లలోనే కరెంట్ బిల్లు.. స్మార్ట్ టెక్నాలజీతో విద్యుత్ శాఖ కొత్త విధానం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ బిల్లుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విద్యుత్ శాఖ సరికొత్త స్మార్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు స్పాట్ బిల్లింగ్ యంత్రాలతో బిల్లులు జారీ చేసిన సిబ్బంది, ఇక నుంచి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే క్షణాల్లో బిల్లులు ఇవ్వగలుగుతున్నారు.ఈ కొత్త విధానంలో స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక డాంగిల్‌ను అనుసంధానం చేసి మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తారు. రీడింగ్ నమోదైన వెంటనే బిల్లు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. బ్లూటూత్ ద్వారా మినీ ప్రింటర్‌ను కనెక్ట్ చేసి అక్కడికక్కడే బిల్లు ప్రింట్ ఇస్తారు. దీంతో ప్రతి ఇంటి వద్ద ఎక్కువ సమయం తీసుకునే అవసరం తగ్గింది.ఈ టెక్నాలజీ వల్ల సిబ్బందికి శ్రమ తగ్గడంతో పాటు, వినియోగదారులకు వేగంగా సేవలు అందుతున్నాయి. ఒకేసారి ఎక్కువ మీటర్ల రీడింగ్ తీసుకునే వీలుండటంతో బిల్లింగ్ ప్రక్రియ మరింత సులభమైంది.ఇక వినియోగదారులు కూడా బిల్లులు చెల్లించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ యాప్‌లు, బ్యాంకింగ్ సేవలు, నెట్ బ్యాంకింగ్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో కరెంట్ బిల్లు చెల్లింపు ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా మారింది.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు