బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నల్లగొండలో ప్రభుత్వ స్కూల్‌కు డిమాండ్.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల రద్దీ

నల్లగొండలో ప్రభుత్వ స్కూల్‌కు డిమాండ్.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల రద్దీ

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసానికి నల్లగొండలోని ఓ స్కూల్ ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్‌ వైపు మొగ్గు చూపే తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం క్యూ కడుతున్నారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో ఈ మార్పు వచ్చింది. ఆధునిక తరగతి గదులు, నాణ్యమైన బోధన, కార్పొరేట్ స్థాయి వసతులతో ఈ స్కూల్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.ఈ పాఠశాలలో వాల్డార్ఫ్ విధానంలో బోధన నిర్వహిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఏసీ క్లాస్‌రూమ్‌లు, ఆడిటోరియం, పోషకాహారంతో కూడిన భోజనం వంటి సదుపాయాలు తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి.సీట్లు పరిమితంగా ఉండటంతో తెల్లవారుజామునే తల్లిదండ్రులు స్కూల్ ముందు క్యూలలో నిలబడుతున్నారు. నల్లగొండతో పాటు సమీప ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందితే, ప్రజల విశ్వాసం ఎలా పెరుగుతుందో ఈ స్కూల్ స్పష్టంగా చూపిస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి