బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

ఏప్రిల్ 8 మా కుటుంబానికి భావోద్వేగ దినం: అన్నా లెజినోవా

ఏప్రిల్ 8 మా కుటుంబానికి భావోద్వేగ దినం: అన్నా లెజినోవా

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఏప్రిల్ 8 ప్రత్యేకమైన రోజు అని ఆయన భార్య అన్నా లెజ్నేవా తెలిపారు. ఆనందం, ఆవేదన కలగలిపిన ఈ రోజు తమ జీవితంలో మరచిపోలేని రోజు అని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ రోజు తమ పెద్ద కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు అని పేర్కొన్నారు. అదే రోజున గత సంవత్సరం తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదం సమయంలో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని, ఆ క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని చెప్పారు. అయితే దేవుడి దయతో అతను సురక్షితంగా బయటపడటం తమకు పునర్జన్మలాంటిదని భావోద్వేగంగా తెలిపారు.అదే రోజున అకీరా పుట్టినరోజు రావడం తమకు ఆనందాన్ని కూడా ఇస్తుందని, అతని ఎదుగుదలపై గర్వంగా ఉందన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అతను ఎప్పుడూ ముందుంటాడని ప్రశంసించారు.ఈ రోజు ఇద్దరు కుమారుల కోసం ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తామని, ఒకవైపు పుట్టినరోజు సంబరాలు, మరోవైపు జీవితాన్ని కృతజ్ఞతతో గుర్తుచేసుకునే రోజు అని అన్నా లెజినోవా తెలిపారు. ఏప్రిల్ 8 తమ కుటుంబానికి నిజంగా ఒక ఎమోషనల్ డే అని పేర్కొన్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?