బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

లంచం తీసుకుంటూ పోలీస్ అధికారులు పట్టుబాటు.. ACB ట్రాప్‌లో చిక్కారు

లంచం తీసుకుంటూ పోలీస్ అధికారులు పట్టుబాటు.. ACB ట్రాప్‌లో చిక్కారు

హైదరాబాద్, ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శంషాబాద్‌లో లంచం వ్యవహారం బయటపడింది. డబ్బుల కోసం బెదిరింపులకు దిగిన ఇద్దరు పోలీస్ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB) చేతిలో పట్టుబడ్డారు.సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ కలిసి ఒక కేసులో బాధితులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని చెప్పి మొదట ఎక్కువ మొత్తాన్ని అడిగి, తర్వాత రూ.2 లక్షలకు ఒప్పుకున్నట్లు సమాచారం.దీంతో బాధితులు ACBను ఆశ్రయించగా, అధికారులు ప్రత్యేకంగా ట్రాప్ ఏర్పాటు చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే ఇద్దరు పోలీసులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించిన ACB అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.అరెస్టైన అధికారులను కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అవినీతి పై ఎలాంటి రాజీ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి