Breaking News

అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణకు భారత్ స్వాగతం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రకటించిన కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. పశ్చిమ ఆసియాలో శాంతి పునరుద్ధరణకు ఇది సహాయకారిగా మారాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. సంఘర్షణలకు దౌత్య మార్గాల్లోనే పరిష్కారం అవసరమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది.ఇటీవల జరిగిన ఘర్షణల ప్రభావంతో ఇంధన సరఫరాలు, వాణిజ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని కేంద్రం పేర్కొంది. పరిస్థితులు త్వరలో సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించింది.ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. రాయబార కార్యాలయంతో సంప్రదించి, సూచించిన మార్గాల్లోనే సురక్షితంగా దేశం విడిచి వెళ్లాలని తెలిపింది.

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *