బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

ఎల్పీజీ సిలిండర్లపై కొత్త నియమాలు అమల్లోకి

ఎల్పీజీ సిలిండర్లపై కొత్త నియమాలు అమల్లోకి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై గ్యాస్ గిడ్డంగులు లేదా ఏజెన్సీల నుంచి నేరుగా వినియోగదారులకు సిలిండర్ల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది.సిలిండర్లు కేవలం బుకింగ్ చేసిన వినియోగదారుల ఇళ్లకే హోమ్ డెలివరీ రూపంలో అందజేయబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గోడౌన్ల వద్దకు వెళ్లి సిలిండర్లు తీసుకోవద్దని ప్రజలకు సూచించింది.ప్రస్తుతం సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సగటున నాలుగు రోజుల్లో సిలిండర్ డెలివరీ జరుగుతోందని వెల్లడించారు.చిరునామా రుజువు లేని వలస కార్మికుల కోసం 5 కిలోల చిన్న సిలిండర్లను అందుబాటులోకి తెచ్చారు. గుర్తింపు కార్డు చూపించి వీటిని సులభంగా పొందే విధానం అమల్లోకి వచ్చింది.అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, గ్యాస్ ఏజెన్సీలపై తనిఖీలు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలు అధికారిక మార్గాల్లోనే సిలిండర్లు పొందాలని విజ్ఞప్తి చేసింది.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు