Breaking News

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి శ్రీ మతి వంగలపూడి అనిత

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 9, (నేటి తెలుగు పత్రిక): స్థానిక శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని ఈరోజు మన రాష్ట్ర గౌరవనీయులైన హోం మంత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన హోం మంత్రి కి దేవస్థాన ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు , అర్చకులు మరియు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హోం మంత్రి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా క్రిష్నయ్య మరియు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి శేష వస్త్రం మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా మంత్రి అనిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ముఖ్య ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఏపీలో ఎండల తీవ్రత.. ఉదయం 11 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి

తోపుడు బండిపై బంగారం అమ్మకం.. విశాఖలో వినూత్న ప్రచారం వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *