బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ జాగృతిలో రంజిత్ చేరిక.. ఏప్రిల్ 25తో కొత్త రాజకీయాలకు నాంది: కవిత

తెలంగాణ జాగృతిలో రంజిత్ చేరిక.. ఏప్రిల్ 25తో కొత్త రాజకీయాలకు నాంది: కవిత

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఏప్రిల్ 25 రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలికే రోజు అవుతుందని అన్నారు. కొత్త తరహా రాజకీయాలతో ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూ, పరిష్కార దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. చేనేత కార్మికులు, సీడ్ పత్తి రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మహబూబ్‌నగర్ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.జాగృతి తరఫున ప్రజల కోసం పనిచేసే రాజకీయాలను తీసుకువస్తామని, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతామని కవిత పేర్కొన్నారు. రంజిత్ కుమార్ వంటి నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి