శాస్త్రీయ పరిజ్ఞానం తోనే మానవ మనుగడ
జె వి వి జిల్లా సర్వసభ్య సమావేశం
అవార్డు గ్రహీతలకు మొక్క- బుక్కు లతో సన్మాన కార్యక్రమం
కోదాడ ,ఏప్రిల్ 9( నేటి తెలుగు పత్రిక): వేసవి సెలవులలో పిల్లలకు శాస్త్రీయ విజ్ఞానం పట్ల అవగాహన పెంచేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, టివి, మీడియా విశ్లేషకులు డాక్టర్ అందే.సత్యం అన్నారు. బుధవారం రాత్రి పట్టణంలో పెన్షనర్స్ భవనంలో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడినారు. శాస్త్రీయ విజ్ఞానంతోనే మానవ మనుగడ, ప్రజలలో సైన్స్ పట్ల నమ్మకం కలిగే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, వేసవి సెలవులలో విద్యార్థులకు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిచేత శాస్త్రీయ పరిజ్ఞాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖను కోరారు. వేసవికాలంలో కూల్ డ్రింక్స్ త్రాగటం వలన కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కలిగే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కూల్డ్రింకులకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీరు, మజ్జిగ, మంచినీరు ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. అనంతరం గత సంవత్సరం నుండి జనవిజ్ఞాన వేదిక చేసిన కార్యక్రమాలు వివరాలు, వేసవిశిక్షణ శిబిరాల నిర్వహణ గురించి జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు వివరించినారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన అవార్డు గ్రహీతలు, జె వి వి సభ్యులు సాహిత్య రచయిత ముప్పాని కృష్ణమూర్తి, ప్రభుత్వ హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ దశరథ, ప్రభుత్వ ఉపాధ్యాయులు బడుగుల సైదులు, డాక్టర్ క్రాంతి కుమార్ ను మొక్క – బుక్ లును బహకరించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం న కు జెవివి జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు అధ్యక్షత వహించగా రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్, జిల్లా పూర్వాధ్యక్షులు చందా శ్రీనివాసరావు ,డిఎన్ స్వామి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసరావు, పాషా, వీరాంజనేయులు, పెన్షనర్స్ భవనం కోశాధికారి వీరబాబు జెవివి సభ్యులు పాల్గొన్నారు.

