బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు భూ హక్కులు

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు భూ హక్కులు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలకు పరిష్కారం దిశగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా సుమారు 75 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పలు నిర్ణయాలను ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలను పరిష్కరించేందుకు రీ-సర్వే 2.0 ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2027 మార్చి నాటికి కోట్లాది కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాల్లో త్వరలోనే పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభమవుతుంది.దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇనాం భూముల సమస్యకు కూడా ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. లక్షల ఎకరాల ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే కొత్త చట్టం తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు.2016కి ముందు ప్రభుత్వ హౌసింగ్ పథకాల కింద ఇళ్లు పొందిన వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో పేద కుటుంబాలు తమ ఆస్తులను అమ్మడం, బహుమతిగా ఇవ్వడం లేదా బ్యాంకు రుణాలు పొందడం సులభం కానుంది.భూ రికార్డుల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. రికార్డులను డిజిటలైజ్ చేసి యజమానుల మొబైల్‌కు పంపించడం, రికార్డ్ లాకింగ్ వంటి వ్యవస్థలను అమలు చేయనున్నారు. దీనివల్ల అక్రమ మార్పులు నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో భూ వ్యవహారాలు పారదర్శకంగా మారి, ప్రజలకు శాశ్వత భద్రత లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్