బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సెల్ఫీ మోజు విషాదం.. జలపాతంలో ముగ్గురు బాలికల ప్రాణాలు కోల్పోయారు

సెల్ఫీ మోజు విషాదం.. జలపాతంలో ముగ్గురు బాలికల ప్రాణాలు కోల్పోయారు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు బాలికలు జలపాతంలో పడి మృతి చెందడం కలచివేసింది. పండుగ సందర్భంగా ఆనందంగా గడపడానికి వెళ్లిన ఈ యువతులు ఇలాంటి దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కొనడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.హుకుంపేట మండలం జంబవలస గ్రామానికి చెందిన ఐదుగురు యువతులు సమీపంలోని ముల్లుంగుమ్మి జలపాతాన్ని సందర్శించారు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు.ఈ క్రమంలో త్రిష, రత్న కుమారి, పవిత్ర అనే ముగ్గురు బాలికలు జలపాతం మధ్యలో ఉన్న బండరాయిపైకి ఎక్కి సెల్ఫీలు దిగుతుండగా, బండరాయి తడిగా ఉండటంతో ఒక్కసారిగా కాళ్లు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. ప్రవాహం తీవ్రంగా ఉండటంతో వారు బయటపడలేకపోయారు.వారి స్నేహితులు సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, కొంతసేపటి తర్వాత ముగ్గురు బాలికల మృతదేహాలను వెలికితీశారు.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సంఘటనతో ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైంది. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్