బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పోచారం ఐటీ కారిడార్‌లో విషాదం.. యువతి ఆత్మహత్య, ప్రియుడు పోలీసుల అదుపులో

పోచారం ఐటీ కారిడార్‌లో విషాదం.. యువతి ఆత్మహత్య, ప్రియుడు పోలీసుల అదుపులో

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల వివరాల ప్రకారం, రమణి అనే యువతి తనకు పరిచయమైన మనోహర్ అనే యువకుడితో సంబంధం కొనసాగిస్తోంది. అయితే పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో యువతి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనోహర్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మనోహర్ యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన రమణి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఘటన వెనుక ఉన్న కారణాలు, ఆరోపణలపై నిజానిజాలు వెలికితీయడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. యువత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి