బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గ్రామీణ మహిళలకు ఉపాధి బలోపేతం.. ఇటుక యూనిట్లకు ప్రోత్సాహం

గ్రామీణ మహిళలకు ఉపాధి బలోపేతం.. ఇటుక యూనిట్లకు ప్రోత్సాహం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను మహిళా సంఘాల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీతో మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు.మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇటుక తయారీ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇవి దోహదపడుతున్నాయని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న ఇటుక యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తూ మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు.మహిళా సంఘాల యూనిట్లు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి