బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ఇంటికే రేషన్.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం ప్రారంభం

విద్యార్థుల ఇంటికే రేషన్.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం ప్రారంభం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందుబాటులో లేకపోవడంతో, ‘డ్రై రేషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం కింద అధికారులు నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరఫరా చేయనున్నారు. అయితే ఈ సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, కేవలం కరువు ప్రభావిత 51 మండలాల్లోనే అమలు చేస్తున్నారు.ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ఈ మండలాల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.ప్రతి విద్యార్థికి ప్రత్యేక కిట్ అందించనున్నారు. ఇందులో 35 గుడ్లు, 21 చిక్కీలు, అలాగే 1-5 తరగతుల వారికి 5 కిలోల బియ్యం, 6-9 తరగతుల వారికి 6 కిలోల బియ్యం ఇవ్వనున్నారు.విద్యార్థులు లేదా తల్లిదండ్రుల ఆధార్ ధృవీకరణతో రేషన్ పంపిణీ జరుగుతుంది. పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఈ పథకం ద్వారా వేసవిలో కూడా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్