Breaking News

జనాభా గణన లో కి ప్రజలు సమగ్ర వివరాలు అందించి సహకరించండి : (సూపర్వైజర్)ఇరిగేషన్ శాఖ ఏఈ నిర్మల సరోజ

గుడ్లవల్లేరు, ఏప్రిల్ 11 ( నేటి తెలుగు పత్రిక ): జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని గుడ్లవ ల్లేరు జనగణన నమోదు పరివేక్షకురాలు, వడ్లవల్లేరు ఇరిగేషన్ శాఖ అధికారిని ( సూపర్వైజర్) నిర్మలసరోజ ప్రజలను కోరారు.గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు మండలంలో జనగణన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి జనగణన విధానం, డేటా సేకరణ పద్ధతులు, గృహాల నమోదు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు అందించబడుతున్నాయి.మాస్టర్‌ ట్రైనీల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన విధి విధానాలపై ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జరుగు తున్న మొదటి బ్యాచ్ కి మూడో రోజు శిక్షణలో భాగంగా శని వారం ఎన్యూమరేటర్లు (సచివాల య సిబ్బంది), సూపర్‌వైజర్లుగా (మండల అధికారులు, సీనియర్‌ అసిస్టెంట్‌)లను నియమింప బడిన వారు ఏప్రిల్‌ 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయగణన జరుప వలసి ఉంటుంది . ఇంటి యజమానే యాప్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకునే విధంగా సూపర్వైజర్ అవగాహన కల్పిస్తున్నారు. ఎన్యూమరేటర్లు విధిగా ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఐడీని ప్రజలు కు అందించాల్సి ఉంటుందన్నారు .

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన చేపడతామన్నారు.జరగబోయే జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను ఎన్యూమ రేటర్లు కు సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్‌ విభాగం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు.క్షేత్రస్థాయిలో పలు గృహాలకు వెళ్లి ఆమె పర్యవేక్షణలో ఏన్యూ మురేటర్లు జనగణన డేటాను ట్రైనింగ్ డెమో కింద సేకరించడం జరగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు ఎన్యూ మ రేటర్లు పాల్గొన్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *