బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బేగంపేట బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు కాజేత

బేగంపేట బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు కాజేత

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తి కస్టమర్ సంతకాలను నకిలీగా తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు విదేశాల్లో ఉన్న సమయంలో అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి 42 చెక్కులను వినియోగించి సుమారు రూ.6.5 కోట్లు అకౌంట్ నుంచి మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ సీనియర్ అధికారులు, ఆపరేషన్స్ సిబ్బంది కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది.దోచుకున్న మొత్తాన్ని వివిధ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కస్టమర్ అనుమతి లేకుండా అతని బ్యాంక్ ఖాతాను మూసివేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంక్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి