బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

నారీ శక్తి వందన సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు.. మహిళల ఆశీస్సులే నాకు బలం

నారీ శక్తి వందన సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు.. మహిళల ఆశీస్సులే నాకు బలం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: నారీ శక్తి వందన సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉపదేశం ఇవ్వడానికి రాలేదని, దేశంలోని కోట్లాది మంది మహిళల ఆశీస్సులు కోరడానికే వచ్చానని భావోద్వేగంగా అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కల ఇప్పుడు సాకారం అవుతున్నదని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో జరిగే ప్రత్యేక సమావేశం దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావడం చారిత్రక పరిణామమని మోదీ అన్నారు. 2029 నాటికి ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.గత దశాబ్దంలో మహిళా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. జన్ ధన్ యోజన ద్వారా 32 కోట్లకు పైగా మహిళలకు బ్యాంక్ ఖాతాలు తెరుచుకున్నాయని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని చెప్పారు.మహిళల శక్తి దేశ అభివృద్ధికి ప్రధాన బలమని, వారి భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ