బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా, తాజాగా బాధితురాలి భర్త ఫిర్యాదుతో కేసు మరోసారి చర్చనీయాంశమైంది.ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17) చర్లపల్లి–ఘట్‌కేసర్ మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి మృతి చెందడం తీవ్ర విషాదానికి దారి తీసింది.అయితే, ఈ ఘటన వెనుక ఆస్తి వివాదమే ప్రధాన కారణమని భర్త సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మేడిపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన తన అత్త, బామ్మర్ది మరియు అతని భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తన భార్య, పిల్లలను మానసికంగా వేధించారని ఆయన పేర్కొన్నారు.“నా భార్య, పిల్లలు బలహీనులు కాదు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, వేధింపుల కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు” అని సురేందర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. ఘటన తర్వాత కూడా తనపై ఆస్తి కోసం ఒత్తిడి పెరిగిందని ఆయన ఆరోపించారు.ఈ కొత్త ఆరోపణలతో పోలీసులు కేసును తిరిగి విచారణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీస్తామని పోలీసులు తెలిపారు. అవసరమైతే మరింత లోతుగా కేసును పరిశీలిస్తామని స్పష్టం చేశారు.కుటుంబ వివాదాలు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చూపిందని, మానసిక ఒత్తిడిని సమయానికి పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి