Breaking News

మే 1 నుంచి తిరుమల దర్శనంలో భారీ మార్పులు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. తిరుమల ఆలయంకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా కొత్త విధానాలను అమలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసే అంశంపై పరిశీలన జరుగుతోంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని కూడా నిలిపివేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం SSD టోకెన్లు తీసుకున్న భక్తులు దర్శనం కోసం దాదాపు 20 నుంచి 23 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు విధాన మార్పులు అవసరమని అధికారులు భావిస్తున్నారు.వీఐపీ దర్శనాలకు కేటాయించే రోజుకు 2 నుంచి 3 గంటల సమయాన్ని సాధారణ భక్తుల దర్శనానికి వినియోగిస్తే, అదనంగా సుమారు 15 వేల మంది భక్తులకు అవకాశం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులతో రోజుకు మొత్తం 80 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇక అన్ని రకాల దర్శనాలను ఒకే కేటగిరీలో నిర్వహించడం ద్వారా క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. దీంతో భక్తులు 8 నుంచి 12 గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తి చేసుకునే అవకాశముందని భావిస్తున్నారు.గత సంవత్సరాల్లో వేసవి కాలంలో నమోదైన భారీ రద్దీని విశ్లేషించిన అధికారులు, ఈ ఏడాది కూడా అంతకుమించి భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందువల్ల ముందస్తుగా ఈ మార్పులను అమలు చేసి, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *