బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎస్సీల ఆరాధ్య దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎస్సీల ఆరాధ్య దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): ఎస్సీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన పామర్రు పట్టణంలో టిడిపి వైసిపి కాంగ్రెస్ జనసేన బిజెపి పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ, దేశంలో మహా పురుషుడు ప్రపంచ మేధావి భారతరత్న దేశం గర్వించదగ్గ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అన్నారు. అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో నేటి యువత పయనిస్తూ ఆ మహనీయుడి ఆశయాలను సాధించుకుందామ న్నారు. నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ రాష్ట్ర ఆ పార్టీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నేటి యువత అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ అసమానతలు లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆకాంక్షించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎస్సి లకు రిజర్వేషన్లు కల్పించిన మహోన్నతుడు బిఆర్ అంబేద్కర్ నేనేన్నారు. పామర్రు బ్లాక్ వన్ కాంగ్రెస్ అధ్యక్షులు తాడిశెట్టి సాంబశివరావు జనసేన నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్ అంబేద్కర్ విగ్రహాల పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అన్ని పార్టీల నేతలు హాజరై అంబేద్కర్ విగ్రహాలు పూలమాలవేసి నివాళులర్పించారు పలు గ్రామాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్