బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు లోకేష్ ప్రోత్సాహం.. ఎవరెస్ట్ యాత్ర ప్రారంభం

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు లోకేష్ ప్రోత్సాహం.. ఎవరెస్ట్ యాత్ర ప్రారంభం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు లోకేష్ ఉండవల్లి నివాసంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. కసి, పట్టుదల ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు సూచించారు.ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. వారి ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల ధైర్యసాహసాలను అభినందించిన లోకేష్, ఎవరెస్ట్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి రావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర ద్వారా ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణ కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్