బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుతో దేశ రాజకీయాల్లో ఉద్రిక్తత.. ఇండియా కూటమి కీలక సమావేశం

డీలిమిటేషన్ బిల్లుతో దేశ రాజకీయాల్లో ఉద్రిక్తత.. ఇండియా కూటమి కీలక సమావేశం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించడంతో అన్ని పార్టీల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.ఈ నిర్ణయంతో అప్రమత్తమైన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఈ బిల్లుపై చర్చించేందుకు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఏప్రిల్ 15న కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం ప్రతిపాదనలకు ఎలా ప్రతిస్పందించాలి, రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను సుమారు 850కి పెంచే ప్రణాళిక ఉంది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.ఈ పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ ప్రక్రియ వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయం వ్యక్తమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ఈ బిల్లుపై తీవ్రంగా స్పందిస్తూ, అమలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలా లేదా సవరణలు కోరాలా అన్న విషయంపై కూటమి నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ