బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుర్గేష్

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుర్గేష్

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పుష్కరాల నిర్వహణపై కీలక చర్చలు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పుష్కరాల ఏర్పాట్లపై కూడా సమగ్రంగా సమీక్షించారని వివరించారు.2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా పుణ్యకాలంలో సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

భక్తుల సౌకర్యాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, రాజమహేంద్రవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి గదులు వంటి సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు.పుష్కర ఏర్పాట్లపై త్వరలోనే రాజమహేంద్రవరం వద్ద విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఏర్పాట్లపై తుది నిర్ణయాలు తీసుకోనున్నారని చెప్పారు.రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచేలా, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్