Breaking News

టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన నేతలు

మంగళగిరి టౌన్, ఏప్రిల్ 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని మంగళగిరి టీడీపీ నాయకులు కొనియాడారు. మంగళవారం టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్ లో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెస్సెస్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ళ చిరంజీవి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. అంటరానితనంకు, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా బడుగుల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసిన మహొన్నత వ్యక్తి అంబేద్కర్ అని వాఖ్యనించారు. పోటీతత్వంతో ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోనే అత్యధికంగా డిగ్రీలు సాధించి ప్రపంచంలోనే అత్యంత తెలివైన జ్ఞానిగా పేరు గాంచారని కొనియాడారు. టీడీపీ హయంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎస్సీ, ఎస్టీ, కమీషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు, దళితుల కేసుల సత్వర పరిష్కారానికి మొబైల్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకోని నడవాలని సూచించారు.

అన్నార్తుల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి లు షేక్ రియాజ్, మల్లవరపు వెంకట రాష్ట్ర వివిధ కార్పొరేషన్ ల డైరెక్టర్ లు తోట పార్థసారథి,బత్తుల హరిదాసు,ఆరుద్ర భూలక్ష్మి,ఎండీ ఇబ్రహీం, విన్నకోట శ్రీనివాసరావు, మున్నంగి శివశేషగిరి రావు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయ రావు,గోవాడ దుర్గారావు,గాదె పిచ్చి రెడ్డి,రంగిశెట్టి నరేంద్ర (బాబీ),వల్లభనేని భార్గవ్,మద్దిరాల రమేష్,షేక్ ఫిరోజ్,ఈపూరి పెద్దబ్బాయి,మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్టి,షేక్ హుస్సేన్, షేక్ నాగుల్ మీరా,వంగర హనుమాన్,వాకా మాధవరావు,షేక్ సుభాని,షేక్ నసీర్,పేరం ఏడుకొండలు,తోట సాంబయ్య,చెల్లూరి సత్యన్నారాయణ,జంజనం వెంకటసుబ్బారావు,నల్లగొండ పరమేశ్వరరావు,గోసాల రాఘవ, షేక్ షమీరా, అబ్దుల్లా ఖాన్,కట్టెపోగు ఉదయభాస్కర్, నక్కా రాజశేఖర్,చెరకు పూర్ణ, సింహాద్రి రామారావు,చిలకలపూడి శేషగిరి,తన్నీరు కృష్ణ,దామర్ల రాంబాబు, కౌతరపు శ్రీనివాసరావు, రంగిశెట్టి పెద్దబ్బాయ్, కొత్త శ్రీనివాసరావు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 11,2026 నుండి కరెన్సీ, కమోడిటీ, నగదు మరియు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాలలో నానోసెకండ్-లెవల్ ఆర్డర్ గుర్తింపును సాధించిన ఎన్ఎస్ఈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *