బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అవివేకమని, రాష్ట్ర చరిత్రను అవమానించే ప్రయత్నమని ఆయన మండిపడ్డారు.తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని, అవసరమైతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావంపై సరైన అవగాహన లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఈ అంశంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించిన పొన్నం, పార్టీ నాయకత్వం తేజస్వికి సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం ఉండాలని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని తెలిపారు. తెలంగాణపై ఎవరైనా నిర్లక్ష్యంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించిన మంత్రి, ఈ వ్యాఖ్యలను సమర్థించే వారిని కూడా తప్పుబట్టారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి