బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా మాట్లాడడం అనుచితమని అన్నారు.ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్‌లో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.అనంతరం ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.అదేవిధంగా, ఆయన వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించడంతో పాటు, సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీలు కోరుతున్నారు.ఈ వివాదం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి