ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రకటనల్లో వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే విషయంపై గతంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
