బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శ

ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శ

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపే పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 28 నెలలు గడిచినా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అన్నారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆమె ఆరోపించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు మాటలకే పరిమితమైందని, రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కూడా సకాలంలో అందడం లేదని తెలిపారు.అలాగే పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తి పెంచుతోందని కవిత అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టిన నిరసనలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కవిత ప్రకటించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి