బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు

రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ విధానాల వల్ల పలువురు యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని తేజస్వి సూర్య ప్రస్తావించారని ఆయన తెలిపారు.2009లో తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ముందుకు వచ్చి తర్వాత వెనక్కి తగ్గిందని, అదే అంశాన్ని తేజస్వి సూర్య ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విమర్శించారు.కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు.అదే సమయంలో బీఆర్‌ఎస్ అవినీతి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి