ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
కరీంనగర్, ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక : నాటి ధరణి, నేటి భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అయినాయ.? అని ప్రజా మిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ప్రశ్నించారు.ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పాత రెవెన్యూ చట్టాలను రద్దుచేసి ధరణి 20 20 ని తీసుకురావడం వలన భూ సమస్యలు అధికమై పోయాయని అన్నారు. ఇట్టి భూ సమస్యలను పరిష్కరించడానికి నేటి ప్రభుత్వం భూభారతి 20 25 ని తీసుకురావడం జరిగిందన్నారు.అయినా కూడా భూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఇండ్లు, 9 లక్షల ఇంటి ప్లాట్లు నిషేధిత జాబితాలోకి వెళ్లడం జరిగింది. కరీంనగర్ పట్టణ శివారు ప్రాంతాలలో కూడా 4,500 ఇండ్లు నిషేధిత జాబితాలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు.ఈ భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కొరివి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.ఈనెల 18న ఉదయం 11 గంటలకు కరీంనగర్ పట్టణం లోని ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసే సమావేశానికి బాధితులు వారికి మద్దతుగా ఆలోచన పరులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ మీడియా సమావేశంలో నల్లాల కనకరాజు, ఐక్యవేదిక కన్వీనర్ పాశం మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, ఐక్యవేదిక సభ్యులు ఆకుల కృష్ణ, పచ్చునూరి నరేందర్, గోగురి బాపు రెడ్డి, భూపతి రవికుమార్, మహమ్మద్ రహీం, తదితరులు పాల్గొన్నారు.
