బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో భారీ సైబర్ మోసం బండబయలు.. 52 మంది అరెస్ట్

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో భారీ సైబర్ మోసం బండబయలు.. 52 మంది అరెస్ట్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక దాడుల్లో 9 రాష్ట్రాల్లో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి 52 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో బ్యాంకు అధికారుల ప్రమేయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.ఈ ఆపరేషన్ వివరాలను పోలీసులు వెల్లడిస్తూ, అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు ఉన్నారని తెలిపారు. వీరు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ లావాదేవీలకు మార్గం సుగమం చేసినట్లు గుర్తించారు.మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో 16 ప్రత్యేక బృందాలు వారం రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆపరేషన్‌ను గోప్యంగా నిర్వహించడం వల్ల నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా చేశామని అధికారులు తెలిపారు.అరెస్టయిన వారిలో 15 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 5 మంది మధ్యవర్తులు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు వర్గాలు కలిసి భారీ స్థాయిలో సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసులు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్స్, ల్యాప్‌టాప్, షెల్ కంపెనీల స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలపై మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీల ద్వారా డబ్బు బదిలీలు నిర్వహిస్తూ సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై మరోసారి అప్రమత్తత అవసరాన్ని తెలియజేస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి