బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఢిల్లీకి హరీశ్‌రావు.. జగిత్యాల సభకు దూరం

ఢిల్లీకి హరీశ్‌రావు.. జగిత్యాల సభకు దూరం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రాజకీయంగా కీలకమైన సమయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీశ్‌రావు జగిత్యాల బహిరంగ సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. నేడు నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభకు ఆయన హాజరు కాలేకపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు తెలంగాణ హైకోర్టు లో తుది దశకు చేరడంతో, న్యాయ సలహాల కోసం ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కేసు కీలక దశలో ఉండటంతో న్యాయపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు వెల్లడించారు. రాజకీయ కార్యక్రమాల కంటే ప్రస్తుతం న్యాయపరమైన అంశాలే ముఖ్యమని భావించి హరీశ్‌రావు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అయితే కీలక సమయంలో సభకు గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై వివిధ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి