హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 వజయంతి ఉత్సవాలు పెరికిడు గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి రాజేష్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడురాజేశ్వరరావు కానుమోలు మాజీ సర్పంచ్ చింతల వెంకట శివ అప్పారావు మాజీ జెడ్పిటిసి సభ్యులు వేగిరెడ్డి పాపారావు ఆళ్ళ గోపాలకృష్ణ బేతాళ ప్రమీల రాణి కొత్తూరు ఆంజనేయులు బండారు సత్యనారాయణ దన్నేమల్లికార్జునరావు కాటుమల పృథ్వి గొట్టాపు ప్రవీణ్ కుమార్ రొంటే శ్రీమన్నారాయణ మున్నంగి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
