బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు..

అమరావతిపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు..

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర విభజన జరిగి దాదాపు పన్నెండు సంవత్సరాలు గడిచినా శాశ్వత రాజధాని ఏర్పాటులో ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. అమరావతి పేరుతో అవినీతి, కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇచ్చినా స్థిర నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక ఏర్పాట్లతో కాలక్షేపం చేశారని మండిపడ్డారు.“అమరావతి ఎప్పటికీ పూర్తికాని ప్రాజెక్ట్‌లా మారింది. మరో 100 జన్మలెత్తినా అది పూర్తి కాదు” అంటూ అంబటి రాంబాబు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.అదే సమయంలో, తమ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలనుకున్నామని, కానీ ఆ నిర్ణయానికి అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్ర అభివృద్ధి ఆలస్యమైందని పేర్కొన్నారు.రాజకీయ లబ్ధి కోసం అమరావతి అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తున్నారని, ప్రజల భావోద్వేగాలను ఉపయోగిస్తున్నారని అంబటి విమర్శించారు. రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అధికార పార్టీ నుంచి వచ్చే స్పందనపై ఆసక్తి నెలకొంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్