బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సంస్కృతం దేశపు ఆత్మ అని మోహన్ భగవత్ వ్యాఖ్యలు

సంస్కృతం దేశపు ఆత్మ అని మోహన్ భగవత్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: భారత సాంస్కృతిక వారసత్వంలో సంస్కృత భాష ప్రాధాన్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదని, ఇది భారతదేశ ఆత్మ అని ఆయన అన్నారు.ఢిల్లీలో సంస్కృత భారతి కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న భగవత్, భారతదేశం ఒక జీవంతమైన సంస్కృతి అని, ఆ సంస్కృతికి మూలాధారం సంస్కృతమే అని పేర్కొన్నారు. దేశ ఆలోచనా విధానం, జీవన శైలి, సంప్రదాయాలకు సంస్కృతం పునాది అని వివరించారు.సంస్కృత భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి జ్ఞాన సంపద అంతా ఈ భాషలోనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. భారతీయ తత్వశాస్త్రం, యోగా, ఆయుర్వేదం వంటి అనేక రంగాల్లో సంస్కృతం కీలక పాత్ర పోషించిందన్నారు. సంస్కృతాన్ని ఆధునిక కాలంలో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దాన్ని సంభాషణా భాషగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సంస్కృత భాష వ్యాప్తికి సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. భవిష్యత్తులో సంస్కృతం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించవచ్చని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ