బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

స్లీపర్ బస్సులపై నిషేధానికి సిఫార్సు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

స్లీపర్ బస్సులపై నిషేధానికి సిఫార్సు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రభుత్వం కు నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో స్లీపర్ బస్సుల్లో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 22 నెలల వ్యవధిలో ఈ బస్సులను పూర్తిగా తొలగించాలని సూచించారు. అంతర్జాతీయంగా కూడా ఇలాంటి బస్సులపై నిషేధం అమలులో ఉన్నట్లు నివేదికలో ప్రస్తావించారు.కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ప్రమాదంపై విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అనుమతి లేకుండా సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చడం, ఎమర్జెన్సీ మార్గాలను మూసివేయడం, అగ్ని నిరోధకత లేని పదార్థాల వినియోగం వంటి లోపాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాకుండా, వాహనాల్లో ప్రమాదకర వస్తువులు ఉండటం, చట్టవిరుద్ధ మార్పులు చేసినప్పటికీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం వంటి అంశాలు కూడా గుర్తించారు. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడుస్తున్నట్లు వెల్లడైంది.ఈ నివేదికను పరిశీలిస్తున్న ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్