బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతు భరోసా నిధుల విడుదల.. లక్షలాది రైతులకు ఆర్థిక ఊరట

రైతు భరోసా నిధుల విడుదల.. లక్షలాది రైతులకు ఆర్థిక ఊరట

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రైతు భరోసా పథకం కింద భారీ మొత్తంలో నిధులను విడుదల చేసి 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నస్తూర్‌పల్లి గ్రామంలో జరిగిన రైతు ఉత్సవాల్లో నిర్వహించబడింది. కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొని రైతులతో నేరుగా మమేకమయ్యారు. అనంతరం జరిగిన సభలో బటన్ నొక్కి రూ.2,200 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.5,700 కోట్లను రైతులకు అందించినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రైతులే దేశానికి వెన్నెముక. వారి ఆర్థిక స్థితి మెరుగుపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.రుణమాఫీపై మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయం లాభదాయకంగా మారాలనే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు నీటి, మార్కెటింగ్, మద్దతు ధరల సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. “వ్యవసాయం పండుగలా మారాలి” అన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.ఈ కార్యక్రమంలో పలు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, రైతులు ప్రభుత్వ చర్యలపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి