బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆధునిక మహిళా ద్రోహులుగా చరిత్రకెక్కిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి: బిజెపి మహిళ మెర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి

ఆధునిక మహిళా ద్రోహులుగా చరిత్రకెక్కిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి: బిజెపి మహిళ  మెర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి

ఒంగోలు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మరియు ఇండియా కూటమిపై NDA మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించినవారిగా చరిత్రలో నిలిచిపోతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడుతూ, పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళల పట్ల అన్యాయం అని అన్నారు. మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిన కీలక బిల్లును అడ్డుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా స్థాయి NDA మహిళా నాయకులు పాల్గొని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. మహిళల అభివృద్ధికి అవరోధంగా నిలిచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు.అదేవిధంగా, మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహిళా హక్కుల పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్